Title : ఆదాయానికి మించిన ఆస్తులు లేవు.. రెరా సెక్రటరీ బెయిల్ పిటిషన్
X
ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. తనకు అక్రమాస్తులు లేవని బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ చెప్పే లెక్కలన్నీ బ్యాంకుల ద్వారానే జరిగాయని జరిగాయని.. ప్రతి ఏటా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు పిటిషన్లో వివరించారు. అయితే శివబాలకృష్ణను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందన్న ఏసీబీ తెలిపింది.
మరోవైపు శివ బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతోంది. అతనిపై వేటు వేయడంపై ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. శివ బాలకృష్ణ హామీతో పలు ఫైళ్లపై సంతకాలు పెట్టిన అధికారులకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అతని హయాంలో జరిగిన అవినీతిపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్టులో ఏసీబీ కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కోర్టు అతడిని ఏసీబీ కస్టడీకి ఇస్తుందా లేక బెయిల్ ఇస్తుందా అనేది సస్పెన్స్గా మారింది.