Home > తెలంగాణ > 'ఈ ఎమ్మెల్యేకు మళ్లీ టిక్కెట్ ఇవ్వొద్దు'.. అధిష్టానానికి BRS నేతల ఫిర్యాదు!!

'ఈ ఎమ్మెల్యేకు మళ్లీ టిక్కెట్ ఇవ్వొద్దు'.. అధిష్టానానికి BRS నేతల ఫిర్యాదు!!

ఈ ఎమ్మెల్యేకు మళ్లీ టిక్కెట్ ఇవ్వొద్దు.. అధిష్టానానికి BRS నేతల ఫిర్యాదు!!
X

మహబూబాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్‌రావు వర్గాలంటూ రెండుగా చీలిపోయారు. ఈ క్రమంలోనే ఓ వర్గం.. మళ్ళీ శంకర్ నాయక్‌కు టికెట్‌ ఇస్తే ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు వ్యతిరేకంగా అసంతృప్త కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు రహస్య భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన చెందుతున్న లీడర్లు.. శంకర్‌ నాయక్‌ను మరోసారి అభ్యర్థిగా ఒప్పుకోమంటున్నారు. గ్రూపులు ఏర్పాటు చేస్తూ పార్టీని విచ్ఛిన్నం చేస్తున్న శంకర్ నాయక్‌ను తప్పించి వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలిపిస్తామని తెలిపారు.

సొంత నేతలనూ ప్రొత్సహిస్తూ ఉద్యమకారులను అవమానిస్తున్నారంటూ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై ఆరోపణలు చేశారు.మహబూబాబాద్ నియోజకవర్గంలో భూకబ్జాలకు, సెటిల్ మెంట్లకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమకు వద్దంటూ అధిష్టానాన్ని సదరు నాయకులు కోరారు. మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. శంకర్ నాయక్‌కు టికెట్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి.. నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు కౌన్సిలర్లు. ‘శంకర్ నాయక్‌ వద్దు.. కొత్తవ్యక్తి ముద్దు’ అంటూ నినాదాలు చేశారు పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు.

Updated : 9 July 2023 9:03 AM IST
Tags:    
Next Story
Share it
Top