Home > తెలంగాణ > ‘‘రేవంత్ అన్నా.. మీతో మాట్లాడాలి’’ వెంటనే స్పందించిన సీఎం

‘‘రేవంత్ అన్నా.. మీతో మాట్లాడాలి’’ వెంటనే స్పందించిన సీఎం

‘‘రేవంత్ అన్నా.. మీతో మాట్లాడాలి’’ వెంటనే స్పందించిన సీఎం
X

మేం పాలకులం కాదు.. సేవకులం. అంటూ ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన ఆ మాటలను పాటిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ప్రతిరోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరిస్తున్నారు. సీఎం వస్తున్నారంటే సెక్యూరిటీ పెంచి, ఎక్కడికక్కడ బందోబస్తు ఎర్పాటుచేస్తారు. కనీసం ఆయనను దగ్గరనుంచి చూడాలన్నా కుదరదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక అన్నీ మారాయి. ప్రజల వద్దకే పాలన అంటూ నడుస్తున్నారు. పిలిస్తే.. క్షణాల్లో మీ ముందుంటా అనే మాటను నిజం చేశారు. ‘మీతో మాట్లాడాల’ని అడిగిన ఓ మహిళను దగ్గరికి పిలిచి మరీ సమస్య తెలుసుకున్నారు సీఎం రేవంత్.

శస్త్ర చికిత్స చేసుకుని హాస్పిటల్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను.. రేవంత్ రెడ్డి ఇటీవల కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే. యశోద హాస్పిటల్ లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. కేసీఆర్‌ను పరామర్శించి వెళ్తుండగా.. తమ సమస్యను పరిష్కరించాలని ఓ మహిళ సీఎం రేవంత్ ను కోరింది. ‘‘రేవంత్‌ అన్నా.. మీతో మాట్లాడాలి’’ అంటూ ఆ మహిళ అభ్యర్థించింది. ఈ క్రమంలో ఆమె గొంతు విన్న సీఎం.. వెంటనే స్పందించి ఆమె దగ్గరకి వెళ్లారు. సమస్య ఏంటో చెప్పాలని అడిగారు. తన పాపకు హాస్పిటల్ ఖర్చు చాలా అవుతోందని.. సాయం చేయాలని ఆ మహిళ కోరారు. దీంతో వెంటనే స్పందించిన రేవంత్.. సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated : 11 Dec 2023 10:28 AM IST
Tags:    
Next Story
Share it
Top