48 గంటలుగా ఆ హోటల్లోనే రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనుంది. ఢిల్లీలో టీకాంగ్రెస్ నేతలతో జరుగుతున్న భేటీ అనంతరం అధిష్టానం సీఎం ఎవరన్నది ప్రకటించనుంది. ఇవాళ సాయంత్రానికల్లా ఈ ఉత్కంఠకు తెరపడనుంది. కాగా రేవంత్ రెడ్డి సహా గెలిచిన ఎమ్మెల్యేలంతా 48 గంటలుగా ఎల్లా హోటల్ లోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి హోటల్ నుంచే కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు. స్థానిక నేతలేకాకుండా.. గెలిచిన ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డిని హోటల్ లోనే కలుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత చేపట్టాల్నిన కార్యక్రమాలను అక్కడ చర్చిస్తున్నారు. కాగా ఒక్కో ఎమ్మెల్యేకు ఒక రూంను కేటాయించినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డితో సహా ఏ ఎమ్మెల్యే హోటల్ నుంచి బయటికి రాలేదు. మరోవైపు ఎల్లా హోటల్ కు భారీ భద్రతను కేటాయించారు. రేవంత్ రెడ్డి ఇంటికి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.