మేం అధికారంలోకి రాగానే రూ.500కే సిలిండర్, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ: రేవంత్ రెడ్డి హామీ
X
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎప్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని, ఒక వేళ డిపాజిట్లు వస్తే తమ పార్టీ నేతలు గుండు కొట్టించుకుంటామని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టిందో అక్కడ ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిందో అక్కడ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు రేవంత్. ‘మీ ఒంట్లో చీము, నెత్తురుంటే.. మీసమున్న మగాళ్లయితే నా సవాల్ కు సిద్దమా అని కేసీఆర్, మంత్రి మల్లా రెడ్డికి సవాల్ విసిరారు.
పేదలకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదరని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని, కేసీఆర్ కుటుంబాన్ని చర్లపల్లి జైల్ లో వేస్తామని తెలిపాడు రేవంత్. అంతేకాకుండా.. అధికారంలోకి రాగానే.. పేదలు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు, ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.