సర్వేల ఆధారంగానే కొల్లాపూర్ టికెట్.. నిర్ణయం అధిష్టానానిదే: రేవంత్ రెడ్డి
X
సర్వేల ఆధారంగానే కొల్లాపూర్ అసెంబ్లీ టికెట్ కేటాయిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం (జులై 4) మల్లు రవి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో కలిసి కొల్లాపూర్ లోని కాంగ్రెస్ నేత జగదీశ్ రావు ఇంట్లో సమావేశం అయిన రేవంత్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు కొల్లాపూర్ టికెట్ తనకేనని ధీమాగా ఉన్న జగదీశ్ రావు.. పార్టీలో జూపల్లి చేరికతో అయోమయంలో పడ్డాడు. కొల్లాపూర్ టికెట్ ఎవరి ఇస్తారనే ప్రశ్న ఆయనలో తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్.. జగదీశ్ రావులో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఎవరికి టికెట్ వచ్చినా సహకరించాలని, టికెట్ రానివారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ నెల 18 తర్వాత కొల్లాపూర్ లో జరగబోయే భారీ బహిరంగ సభను విజయ వంతం చేయాలని ఇరువురు నేతలను సూచించారు. సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్ కేటాయిస్తామని, పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఇది జరుగుతుందని రేవంత్ స్పష్టం చేశారు.