Home > తెలంగాణ > రజనీ ఉద్యోగ నియామక ఫైల్పై రేవంత్ తొలి సంతకం.. ఇంతకీ ఎవరామె..?

రజనీ ఉద్యోగ నియామక ఫైల్పై రేవంత్ తొలి సంతకం.. ఇంతకీ ఎవరామె..?

రజనీ ఉద్యోగ నియామక ఫైల్పై రేవంత్ తొలి సంతకం.. ఇంతకీ ఎవరామె..?
X

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన ఎల్బీ స్టేడియం వేదికగా సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం ఏ ఫైల్పై చేస్తారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే దివ్యాంగురాలైన రజనీకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ ఆమె నియామక ఉత్తర్వుల ఫైల్పై రేవంత్ ఫస్ట్ సైన్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఆమెకు ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం.

అక్టోబర్ 17న దివ్యాంగురాలైన రజనీ గాంధీ భవన్ కు వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె రేవంత్ రెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఎంఏ చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, ఏ ప్రైవేట్ కంపెనీ కూడా తనకు ఉద్యోగం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ఉద్యోగం ఆమెకే ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రమాణస్వీకారం రోజున రజనీ ఉద్యోగ నియామక ఫైల్ పై రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలి సంతకం చేయనున్నట్లు సమాచారం.

దివ్యాంగురాలైన రజని హైదరాబాద్ నాంపల్లిలోని బోయగూడ కమాన్ నివాసి. 38ఏండ్ల ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె.. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో రేవంత్ రెడ్డిని కలిసి తన బాధ చెప్పుకున్నారు.

Updated : 6 Dec 2023 5:33 PM IST
Tags:    
Next Story
Share it
Top