ఇకపై తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది- సీఎం రేవంత్ తొలి ట్వీట్
X
తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరిందని అన్నారు. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయని, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుందని ఆకాంక్షించారు. పేదల ముఖాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయని, హక్కుల రెక్కలు విచ్చుకుంటాయని చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని, ఇది మీ అన్న ఇస్తున్న మాట అని ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.
తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 1.04గంటలకు ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా 11 మంది సహచర మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
— Revanth Reddy (@revanth_anumula) December 7, 2023
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు… pic.twitter.com/AmZfpFhqcn