Revanth Reddy : విదేశాలకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి
X
విదేశాలకు విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభ వార్త చెప్పారు.మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షీప్‌ను మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గురుకులాలకు సొంత భవనాలకు స్థలాల గుర్తించాలని సీఎం తెలిపారు. ఇప్పుడున్న దాని కంటే ఎక్కువ మంది అర్హులైన స్టూడేంట్స్‌కు ఉపయోగ పడేల చూడాలని అన్నారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని సీఎం సూచించారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. దీంతో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని అన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవటం ద్వారా వారిలో ప్రతిభా పాఠవాలు పెరుగుతాయని, పోటీ తత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.