Home > తెలంగాణ > మరో రెండు పథకాలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు..

మరో రెండు పథకాలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు..

మరో రెండు పథకాలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు..
X

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటి అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలుకు సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 27 లేదా 29 న ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. గురువారం సెక్రటేరియెట్లో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ది జరిగేలా చూడాలని సీఎం సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలుగా గృహజ్యోతి, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. గ్యాస్ సిలిండర్పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా.. లేదా ఏజెన్సీలకు చెల్లించాలా..? అన్న అంశంపై చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ.. అందుకున్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చివరకు లబ్ధిదారులు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేలా చూడాలని సూచించారు. సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని, ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

అనుమానాలు, అపోహలకు తావులేకుండా ఫ్రీ కరెంటు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్లలోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు. ప్రజా పాలన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్లలో తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారికి సవరించుకునే అవకాశమివ్వాలని సీఎం సూచించారు. కరెంట్ బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లలో ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. తప్పులం సవరించుకున్న వారికి ఆ తర్వాతి నెల నుంచి పథకం వర్తింపజేయాలని రేవంత్ స్పష్టం చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుం ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

Updated : 22 Feb 2024 11:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top