బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చింది.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు
X
అసెంబ్లీలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఓట్ ఆన్ బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందని అన్నారు. బడ్జెట్ లో పూర్తి కేటాయింపులు లేవని అన్నారు. పాత పేర్లు మార్చి కొత్త పేర్లు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ చేంజర్ అని, గేమ్ చేంజర్ కాదని సెటైర్లు వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్నాన్ని విమర్శించడానికే అన్నట్లు బడ్జెట్ సమావేశాలు సాగాయని అన్నారు. బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అర్థమవుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్ లో ప్రస్తావన లేదని అన్నారు. ఏ ఏ వర్గాలకు ఎంత కేటాయిస్తామనే అంశం అందులో ఏమాత్రం లేదని అన్నారు.
ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని చెప్పన ఈ ప్రభుత్వం.. అసలు దాని గురించే మాట్లాడలేదని అన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కవిత అన్నారు. కాగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.