Home > తెలంగాణ > గ్రూప్ 1 పరీక్ష రద్దుపై సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ

గ్రూప్ 1 పరీక్ష రద్దుపై సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ

గ్రూప్ 1 పరీక్ష రద్దుపై సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
X

సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు నేపథ్యంలో ఈ లెటర్ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఎస్పీఎస్సీ తప్పిదాలను అందులో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి తీరుపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైకోర్టు తీర్పు బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు అని రేవంత్ అన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవస్థల విధ్వంస ప్రతిఫలమే ఈ దుస్థితికి కారణమని చెప్పారు. బీఆర్ఎస్‌ అన్యాయమైన, దుర్మార్గామైన పాలనకు విద్యార్ధులు, నిర్యుదోగుల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. పరీక్షలు రద్దు చేయడంకాదని కేసీఆర్ సర్కార్‌నే రద్దు చేయాలని రేవంత్ అన్నారు. అలా చేస్తేనే ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఉద్యోగ నియామకాలు న్యాయంగా జరగాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ పిలుపునిచ్చారు. తొలి, మలి దశ ఉద్యమంలో యువత, విద్యార్థులది కీలక పాత్ర అన్న ఆయన.. తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత, విద్యార్థులకు అడుగడునా పరాభావం ఎదురవుతూనే ఉందని అన్నారు. ఇంటర్మీడియట్ పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన తప్పులతో 27 మంది విద్యార్ధుల ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 2015లో సింగరేణి మొదలు, ఎంసెట్ పేపర్ లీకేజీ, విద్యుత్ సంస్థ నియామక పరీక్ష పేపర్ లీక్, పదో తరగతి పేపర్ లీకు.. అక్కడి నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో ముఖ్యమంత్రి మోసం పరాకాష్టకు చేరిందని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ జంగ్ సైరన్ల పేరుతో పోరాటాలు చేస్తే వాటిని కూడా పోలీసులను అడ్డుపెట్టి అణచి వేసే ప్రయత్నం చేశారని రేవంత్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ. 3,106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఉద్యోగాలను భర్తీ చేస్తారనే ఆశతో 30 లక్షల మంది యువత నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారని, తల్లిదండ్రులు పంపించే చాలీచాలనీ డబ్బులతో హాస్టళ్లలో ఉండి కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టి పరీక్షలకు ప్రిపేరవుతున్నారని చెప్పారు.

Updated : 23 Sept 2023 10:49 PM IST
Tags:    
Next Story
Share it
Top