Home > తెలంగాణ > మంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

మంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

మంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
X

భారీ వర్షాల కారణంగా ఇబ్బందులపాలైన బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రబుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్‌ వాసులు విలవిలలాడిపోయారని, బాధిత కుటుంబాలకు రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని అన్నారు. వానల కారణంగా దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన బాగు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట్లు చెబుతుంటారని, ప్రపంచ దేశాల సంగతేమో గానీ నగర ప్రజలే బయటకు రావడానికి ఒకటికి పది సార్లు ఆలోచించే దుస్థితి నెలకొందని రేవంత్ లేఖలో రాశారు. నగరంలో ఎక్కడ గుంత ఉందో? ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో? అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని తిరిగాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్భాలు పలికిన కేటీఆర్... గత 9 ఏండ్లలో నగరంలో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు చేసే ఒక్క చర్య కూడా చేపట్టలేదని విమర్శించారు. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించినా మంత్రిగా కనీసం పరిస్థితిని సమీక్షించేందుకు కూడా కేటీఆర్ కు లేదా అని రేవంత్ ప్రశ్నించారు.




Updated : 31 July 2023 8:03 PM IST
Tags:    
Next Story
Share it
Top