Home > తెలంగాణ > ఉచిత కరెంట్’పై వెనక్కి తగ్గని రేవంత్.. 60 వేలకోట్ల అప్పులు, అవినీతి అంటూ

ఉచిత కరెంట్’పై వెనక్కి తగ్గని రేవంత్.. 60 వేలకోట్ల అప్పులు, అవినీతి అంటూ

ఉచిత కరెంట్’పై వెనక్కి తగ్గని రేవంత్.. 60 వేలకోట్ల అప్పులు, అవినీతి అంటూ
X

తెలంగాణ రైతులకు ఉచిత కరెంటు 8 గంటలు చాలంటూ కలకలం రేపిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. అటు బీఆర్ఎస్ పార్టీతోపాటు, ఇటు సొంత పార్టీ నేతలు తూర్పారబడుతున్నా తన వాదన మానలేదు. ఉచిత విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీకి గులాబీ పార్టీ బీ టీమ్‌గా మారిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

‘‘ బీఆర్ఎస్ బీజేపీ కి “బి” టీం అని మరోసారి నిరూపితమైంది. రేపు(బుధవారం) రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుకు నిరసనగా చేపట్టనున్న సత్యాగ్రహ దీక్ష పిలుపుని నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తోంది. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుంది. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం’’ అని రేవంత్ తెలిపారు.

తానా సభల కోసం అమెరికా వెళ్లిన రేవంత్ ఉచిత విద్యుత్‌పై మాట్లాడుతూ రాష్ట్రంలో 95 శాతం రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులేనని, 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుదని అన్నారు. విద్యుత్ సంస్థల నుంచి కమీషన్ కోసమే 24 గంటల ఉచిత కరెంట్ పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.


Updated : 11 July 2023 6:20 PM IST
Tags:    
Next Story
Share it
Top