Home > తెలంగాణ > ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి

ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి

ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అధిష్టానాన్ని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ ఎంపీగా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాగా రేపు జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఢిల్లీలో అధిష్టానాన్ని కలిసిన రేవంత్ అసెంబ్లీలో పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్‌ గాంధీలతో.. మంత్రులకు శాఖల కేటాయింపుపై ఆయన చర్చించనున్నారు. గురువారం రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రేపు సోనియా గాంధీ పుట్టిన రోజున 64 ఎమ్మెల్యేల ప్రమాణి స్వీకారం, 11 మంది మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతుంది. దీంతో పాటు మిగిలిన ఆరుగురు మంత్రులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఆ ఆరుగురు మంత్రులు ఎవరవుతారనేనది ఆసక్తికరంగా మారింది.

Updated : 8 Dec 2023 6:25 PM IST
Tags:    
Next Story
Share it
Top