హైదరాబాద్ బయల్దేరిన రేవంత్.. హైకమాండ్ పిలుపుతో మళ్లీ..
X
తెలంగాణ నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి అగ్ర నేతలతో భేటీ అయ్యారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీలతో రేవంత్ సమావేశమయ్యారు. తనను సీఎల్పీ నేతగా ప్రకటించినందుకుకృతజ్ఞతలు చెప్పారు.
గురువారం) హైదరాబాద్‌లో జరగబోయే తన ప్రమాణస్వీకారానికి నేతలందరినీ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రాష్ట్రంలో మంత్రివర్గం కూర్పు, ఇతర అంశాలపై కూడా హైకమాండ్ నేతలతో చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే విమానం ఎక్కేలోపు రేవంత్‌రెడ్డికి హైకమాండ్ ఫోన్ రావడంతో వెంటనే ఏఐసీసీకి తిరిగి వెళ్లారు. మహారాష్ట్ర సదన్‌కు చేరుకొని మాణిక్‌రావు ఠాక్రేతో సమావేశమయ్యారు.