Home > తెలంగాణ > తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన రేవంత్ రెడ్డి..

తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన రేవంత్ రెడ్డి..

తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన రేవంత్ రెడ్డి..
X

తెలంగాణలో పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తుంటే మరోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు ఇంకా 5-6 నెలలే సమయం ఉండడంతో పార్టీ మార్పులు షురూ అయ్యాయి. ఇక కర్ణాటకలో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఊపు వచ్చింది. పేరుగాంచిన నాయకులు సైతం ఆ పార్టీ వైపు తొంగిచూస్తున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చే సీట్ల సంఖ్యపై జోష్యం చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలు ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీకి 37 శాతం, కాంగ్రెస్ కు 34 శాతం, బీజేపీకి 14 శాతం ఓట్లు వస్తాయని తెలిపారు. సీట్ల పరంగా చూస్తే బీఆర్ఎస్ కు 45 సీట్లు, కాంగ్రెస్ కు 45, బీజేపీకి 7, ఎంఐఎం పార్టీకి 7 సీట్లు గెలుచుకుంటాయని వెల్లడించారు. మరో 15 స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉంటుందుని చెప్పారు. గతంలో 24 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు ఇప్పుడు 14 శాతానికి పడిపోయిందని రేవంత్ అన్నారు.ఎన్నికల నాటికి పరిస్థితిలో మరింత మార్పు రావొచ్చని వివరించారు. పార్టీల వారీగా ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం లెక్కలు చెప్పినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా తప్పక ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Updated : 17 Jun 2023 5:11 PM GMT
Tags:    
Next Story
Share it
Top