Home > తెలంగాణ > త్వరలో.. కేసీఆర్ విదేశాలకు పారిపోతారు

త్వరలో.. కేసీఆర్ విదేశాలకు పారిపోతారు

త్వరలో.. కేసీఆర్ విదేశాలకు పారిపోతారు
X

తెలంగాణ ప్రభుత్వం వరుసగా భూములను వేలం వేస్తోంది. ఇటీవలే కోకాపేట భూముల వేలంలో రూ. 3వేల కోట్లకు పైగా డబ్బు ప్రభుత్వ ఖజానాలో చేరింది. మరోసారి భూముల వేలానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూములు కొనుగోలు చేస్తున్న వాళ్లకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం (ఆగస్టు 14) మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ పై తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది.. రాష్ట్ర ప్రజల అభివృద్ధికే తప్ప.. ఓఆర్ఆర్ భూములు, దళితుల భూములు అమ్ముకోవడానికి కాదన్నారు. ప్రజలకు చెందాల్సిన వందల ఎకరాల భూములను ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. భూములు అమ్ముతుంది ప్రభుత్వం కోసమే తప్ప.. ప్రజల కోసం కాదని విమర్శించారు. భూములు కొన్నవాళ్లు దయచేసి జాగ్రత్తగా ఉండాలని రేవంత్ హెచ్చరించారు.





రాబోయే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని, పలు సర్వేలు కూడా అదే చెప్తున్నాయని రేవంత్ అన్నారు. ఆ పార్టీకి కనీసం 25 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని, అందుకే భూములు అమ్మి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు. ఆ కారణంగానే సొంత మనుషులకు టెండర్లు ఇచ్చేందుకు వైన్స్ టెండర్లు ముందుగా వేస్తున్నారు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మళ్లీ టెండర్లు వేయిస్తామని రేవంత్ అన్నారు.




Updated : 14 Aug 2023 2:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top