Home > తెలంగాణ > పదేళ్ల పాలనలో.. కట్టు బానిసలకంటే హీనంగా చూశారు: రేవంత్ రెడ్డి

పదేళ్ల పాలనలో.. కట్టు బానిసలకంటే హీనంగా చూశారు: రేవంత్ రెడ్డి

పదేళ్ల పాలనలో.. కట్టు బానిసలకంటే హీనంగా చూశారు: రేవంత్ రెడ్డి
X

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజా ప్రతినిధులకు అవమానాలు పడ్డారని.. ప్రజలను కట్టుబానిసల కన్నా హీనంగా చూశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బాధలు తనకు తెలుసన్నారు. నిధులు రాకపోతే ప్రతినిధుల ఆస్తులు, బంగారం అమ్మి పనులు చేయించారని చెప్పారు. కేసీఆర్ పాలనకు మంగళం పాడే టైం వచ్చిందని అన్నారు. కేసీఆర్ ప్రజల్ని పురుగుల కంటే హీనంగా చూశారు. ఈ ఎన్నికలు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్నాయని.. జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి ఓటెయ్యాలి పిలుపునిచ్చారు.

తాను మరో 20ఏళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని రేవంత్ తెలిపారు. స్వేచ్ఛ కోసమే తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని కోరుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చి స్వేచ్ఛను గుంజుకుంటే ఒప్పుకోరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల అమలుతోపాటు ఏడో గ్యారంటీని ప్రకటించారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ లో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, ఉమ్మడి నిర్ణయాలే అమలవుతాయని తెలిపారు.

Updated : 26 Nov 2023 8:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top