Home > తెలంగాణ > టీచర్ అభ్యర్థుల పోరాటానికి రేవంత్ మద్దతు

టీచర్ అభ్యర్థుల పోరాటానికి రేవంత్ మద్దతు

టీచర్ అభ్యర్థుల పోరాటానికి రేవంత్ మద్దతు
X

డీఎస్సీలో కేవలం 5వేల పోస్టుల భర్తీ చేస్తామన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీచర్ అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అభ్యర్థులకు అండగా ఉంటామని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మెగా డీఎస్సీకాదు ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ అన్ని మండిపడ్డారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. సీఎం కేసీఆర్ 13 వేల పోస్టుల ఖాళీగా ఉన్నాయని చెప్పారని అన్నారు. అన్ని పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్లను ఎందుకు ఇస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఎన్నికల భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడనిమండిపడ్డారు.

బుధవారం కర్ణాటకలో గృహలక్ష్మి పథకాన్ని రాహుల్ గాంధీ సమక్షంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా మరో ట్వీట్ చేసిన రేవంత్.. చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించడమే మా నైజం అని పోస్ట్ చేశారు. ‘‘'కారు'కూతలు రావు'.. జూటా' మాటలు లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే.. కర్నాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో.. నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించామని రేవంత్ స్పష్టం చేశారు.




Updated : 30 Aug 2023 10:27 PM IST
Tags:    
Next Story
Share it
Top