'విధ్వంసమైన జలదృశ్యాన్ని తెలంగాణ సమాజం కళ్లారా చూడబోతోంది'... CM Revanth Reddy
X
మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డకు చేరుకోనుంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని... మరమ్మతులకు కూడా పనికిరాదని వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై చిందులు తొక్కిన బీజేపీ.. వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదని సీఎం రేవంత్ విమర్శించారు.
తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది.
— Revanth Reddy (@revanth_anumula) February 13, 2024
రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి…
97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్,
మేడిగడ్డ కూలి నెలలు… pic.twitter.com/GPGGtBX8Lf
"తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి… 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు… పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది.ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన.
కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం. బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదు. కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు… వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదు. అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయి. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వంసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోంది." అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.