Home > తెలంగాణ > బీజేపీ నిరంకుశ పాలకు చెంపపెట్టు - రేవంత్ రెడ్డి

బీజేపీ నిరంకుశ పాలకు చెంపపెట్టు - రేవంత్ రెడ్డి

బీజేపీ నిరంకుశ పాలకు చెంపపెట్టు - రేవంత్ రెడ్డి
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్దరించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయం అని అన్నారు. న్యాయం ఎప్పటికైనా గెలిచి తీరుతుందనడానికి రాహుల్ గాంధీ ఉదంతమే నిదర్శనమని అన్నారు. బీజేపీ పాలకుల నిరంకుశ వైఖరికి ఇది చెంప పెట్టు అని రేవంత్ అభిప్రాయపడ్డారు. లోక్ సభ సభ్యత్వం పునరుద్దరణ అనంతరం పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి సాదరంగా ఆహ్వానించినట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంటుకు వచ్చారు. ఆయన పార్లమెంటు ఆవరణలోకి వచ్చిన వెంటనే ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ జిందాబాద్ నినాదాలతో స్వాగతం పలికారు.

లోక్ సభ సభ్యత్వం పునరుద్దరణ అనంతరం తొలిసారి పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీ మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం లోక్ సభలో అడుగుపెట్టారు.


Updated : 7 Aug 2023 1:04 PM IST
Tags:    
Next Story
Share it
Top