Home > తెలంగాణ > కాంగ్రెస్ ఉన్న చోట కరెంటు ఉండదు - నర్సాపూర్ రోడ్ షోలో కేటీఆర్

కాంగ్రెస్ ఉన్న చోట కరెంటు ఉండదు - నర్సాపూర్ రోడ్ షోలో కేటీఆర్

కాంగ్రెస్ ఉన్న చోట కరెంటు ఉండదు - నర్సాపూర్ రోడ్ షోలో కేటీఆర్
X

తెలంగాణను నాశనం చేసిన వారు మళ్లీ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వారి మాటలు విని మోసపోవద్దని సూచించారు. నర్సాపూర్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు రోజుకో డ్రామా ఆడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానన్న మోడీ ఆ మాట నిలబెట్టుకున్నాడా అని కేటీఆర్ ప్రశ్నించారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డితో పాటు కొడంగల్లోనూ ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు 2014కు ముందు కరెంటు కోసం పడ్డ కష్టాలు గుర్తించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న ఆయన.. రేవంత్ రెడ్డి రైతు బంధు దుబారా అని అనలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

రైతు బంధు పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.73వేల కోట్లు వేసిన ఘనత కేసీఆర్‌ సొంతమని మంత్రి అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా తదితర సంక్షేమ పథకాలెన్నింటినో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్న కేటీఆర్.. సునీత లక్ష్మారెడ్డిని గెలిపిస్తే నర్సాపూర్లో ఐటీ హబ్, పరిశ్రమలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Updated : 26 Nov 2023 7:13 PM IST
Tags:    
Next Story
Share it
Top