Home > తెలంగాణ > పాలమూరు ధైర్యమే..నాకు స్ఫూర్తిగా నిలిచింది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

పాలమూరు ధైర్యమే..నాకు స్ఫూర్తిగా నిలిచింది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

పాలమూరు ధైర్యమే..నాకు స్ఫూర్తిగా నిలిచింది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
X

మహబూబ్‌నగర్‌లో పాలమూరు ప్రజాదీవెన సభలో స్ధానిక సంస్ధల పాలమూరు అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆయను ఆశీర్వదించాలని కోరారు. త్వరలో లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామన్నారు. ఇక తాను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకుకోలేదని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతు ప్రధాని మోదీ దగ్గర తాను మోకరిల్లానంటూ కొందర విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 'నేను ఆ సన్నాసుల్లా 4 గోడల మధ్య కలవలేదు. మోదీ కడుపులో తలకాయ పెట్టలేదు. మంచితనం చేతగాని తనం కాదు. మన మర్యాద రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి గానీ సంఘర్షణ ఉండొద్దు. అందుకే మోదీకి సమస్యలను వివరించా. కేంద్రం మన సమస్యలను తీర్చకుంటే నిలదీసే బాధ్యత నాది' అని వివరించారు. తెలంగాణను గత ప్రభుత్వం పదేళ్లలో లూటీ చేశారని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ పాలమూరుకి ఒక్క పారిశ్రామ అయిన తీసుకోవచ్చందా అని ఆయన తెలిపారు.

మోడీ అయిన కేడీతో అయిన కొట్లాడాతని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 35,000 ఇండ్లు పేదలకు ఇస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తా అని చెప్పారు. కేసీఆర్ లాగా రాష్ట్రాన్ని మోడీ మోకాళ్ల దగ్గర పెట్టబోను అని హామీ ఇచ్చారు. కేసీఆర్ వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నామని అన్నారు. మూడు నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఈ ప్రభుత్వాన్ని మాత్రం రెండు నెలలకే పడగొడుతామని అంటున్నారని సీరియస్ అయ్యారు. పేదల ప్రభుత్వాన్ని పడగొడుతామన్న వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. అతిథి ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని తాను నమ్ముతానని బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే.. బిల్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు. మన మంచితనం చేతకానితనం కాదని.. మనం అడిగిన పనులు చేయకపోతే మోడీని కడా ఉతికి ఆరేస్తానని అన్నారు.

Updated : 6 March 2024 8:46 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top