Home > తెలంగాణ > సీఎం పదవిపై మోత్కుపల్లి నర్సింహులు సంచలన కామెంట్స్

సీఎం పదవిపై మోత్కుపల్లి నర్సింహులు సంచలన కామెంట్స్

సీఎం పదవిపై మోత్కుపల్లి నర్సింహులు సంచలన కామెంట్స్
X

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. ఎవరు అవునన్నా.. కాదన్నా.‌. రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ బలపడిందని అన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పాలనపైన మోత్కుపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. వంద శాతం రుణ మాఫీ చేయడంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని, కేసీఆర్‌కు పదేళ్లు అవకాశమిచ్చారని, ఇక చాలని అభిప్రాయపడ్డారు.

జైలులో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా ఉపవాస దీక్ష చేపట్టిన మోత్కుపల్లి.. ఎన్టీఆర్, సీబీఎన్ హాయాంలోనే మాదిగలకు న్యాయం జరిగిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా నిర్భందించి జైల్లో పెట్టారని ఆరోపించారు. జైల్లో కిరాతకులుండాలి.. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినవాళ్లు కాదని అన్నారు. ఏపీ సీఎం జైల్లో ఉండి వస్తే.. అందరూ జైలుకు పోవాలా? అని ప్రశ్నించారు. జనసేనతో కలవటంతో ఏపీలో చంద్రబాబుకు బలం పెరిగిందన్న మోత్కుపల్లి పవన్ కల్యాణ్ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉందని, టీటీపీ, జనసేన కొన్ని ప్రాంతాల్లో స్వీప్ చేయబోతున్నాయని జోస్యం చెప్పారు.



telangana,ts politcs,telangana election,assembly election,congress party,tpcc chief,revanth reddy,mothkupally narsimhulu,sonia gandhi,cm kcr,welfare schemes,loan waiver,ntr,chandrababu naidu,rajamahendravaram jail

Updated : 23 Oct 2023 1:57 PM IST
Tags:    
Next Story
Share it
Top