Home > తెలంగాణ > హైదరాబాద్‌‌లో కారు బీభత్సం..ఇద్దరు మహిళలు మృతి

హైదరాబాద్‌‌లో కారు బీభత్సం..ఇద్దరు మహిళలు మృతి

హైదరాబాద్‌‌లో కారు బీభత్సం..ఇద్దరు మహిళలు మృతి
X

అతివేగంతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‎ పరిధిలో ఓ కారు భీభత్సం సృష్టించింది. బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద మార్నింగ్ వాక్‌కు వెళ్లినవారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు అనురాత (58), మమత (26) మృతి చెందారు. కవిత అనే మరో మహిళ, ఇంతిఖాబ్ ఆలం అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారులో ఓ తల్వార్‌ను గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా నిందితుడి వివరాలు సేకరించారు.

Updated : 4 July 2023 11:18 AM IST
Tags:    
Next Story
Share it
Top