Home > తెలంగాణ > వాన బీభత్సం.. చెరువులకు గండి, రోడ్లకు గుంతలు, వంతెనలన్నీ ధ్వంసం

వాన బీభత్సం.. చెరువులకు గండి, రోడ్లకు గుంతలు, వంతెనలన్నీ ధ్వంసం

వాన బీభత్సం.. చెరువులకు గండి, రోడ్లకు గుంతలు, వంతెనలన్నీ ధ్వంసం
X

రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి వర్షాలు దంచి కొట్టాయి. దాంతో కాలువలు, వాగులు, నదులు, చెరువులు ఉప్పొంగాయి. వరద నీరు గ్రామాల్లోకి చేరి ప్రజలు తీవ్ర అవస్తలు ఎదుర్కొన్నారు. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటినుంచి వర్షాలు తగ్గు ముఖం పట్టినా.. ఇంకా కొన్ని గ్రామాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విదంగా ఈ ఏడాది వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వర్షాల ప్రభావానికి రాష్ట్ర వ్యాప్తంగా 49 బ్రిడ్జిలు ధ్వంసం అయినట్లు అంచనా వేస్తున్నారు. జాతీయ రహదారులకు సంబంధించి 11 చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర రహదారుల్లో 38 ప్రాంతాల్లో బ్రిడ్జ్ లు కూలిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్, కామారెడ్డిలో 15 బ్రిడ్జిలు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు.

జగిత్యాల జిల్లాలో 10 వంతెనలు, రాజన్న సిరిసిల్లా జిల్లాలో 4, ఆదిలాబాద్ లో 3 బ్రిడ్జ్ లు దెబ్బతిన్నాయి. జనగామ, మంచిర్యాల, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లల్లో 2 చొప్పున వంతెనలు ధ్వంసం అయ్యాయి. కాగా, 250 ప్రాంతాల్లో రహదారులపై వరద ప్రవహించింది. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మత్తుల కోసం క్షేత్ర స్థాయిలో ఉన్న నిధులు వాడుకోవాలని ప్రభుత్వం సూచించింది. తక్షణ సాయంగా రూ. 120 కోట్లను మంజూరుచేసింది. అంతేకాకుండా రాష్ట్రంలోని జాతీయ రహదారుల మరమ్మత్తు కోసం రూ.29 కోట్లు అవసరం అవుతాయని, వాటిని తక్షణ సాయంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.



Updated : 29 July 2023 2:24 PM IST
Tags:    
Next Story
Share it
Top