Home > తెలంగాణ > ఇందిరమ్మ ఇండ్లు..వారికి రూ. లక్ష అధికం

ఇందిరమ్మ ఇండ్లు..వారికి రూ. లక్ష అధికం

ఇందిరమ్మ ఇండ్లు..వారికి రూ. లక్ష అధికం
X

తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే పథకంలో గిరిజనులు, దళితులకు రూ.లక్ష అదనంగా కలిపి మొత్తం రూ.6లక్షలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాది రాములోరి సన్నిధిలో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మణానికి రూ.5లక్షలు అందజేస్తారు.ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళలు పేరుతో ఉంటాయని సీఎం తెలిపారు.ఖమ్మం జిల్లా ప్రజలు మొదటి నుంచి కేసీఆర్‌ను నమ్మలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాచల రామచంద్రుడి ఆశీస్సులు తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే బడుగుల ఆత్మగౌరవమని వ్యాఖ్యానించారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని పేర్కొన్నారు. మహిళ చేతిలో ఇంటి నిర్వహణ ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందన్నారు.

పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు. తాము నాలుగున్నర లక్షల మందికి ఇళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తున్నామన్నారు.తాము డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని.. కానీ ఏ ఊరిలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో ఆ ఊర్లో మేం ఓట్లు అడగం.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఊళ్లో వాళ్లు అడవగద్దని.. ఈ సవాల్‌కు వారి సిద్ధమేనా? అని ప్రశ్నించారు. తన ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు.సొంతింటి కల సాకారం కోసం పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల బాధలు చూసే ఆరు గ్యారంటీలను ప్రకటించామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పేదవాడికి సొంతిల్లు కూడా ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. భద్రాచలం అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. భద్రాచలం అభివృద్ధికి తమ వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు

Updated : 11 March 2024 10:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top