Home > తెలంగాణ > బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
X

ఇటీవల బిఎస్పీని వీడిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలో తెలంగాణ మాజీ సీఎం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఆయన అనుచరులు కుడా బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని సమాచారం. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీ రిజర్వుడ్ సెగ్మెంట్ అయిన నాగర్ కర్నూల్ స్థానం నుండి ఆర్ఎస్పీని బరిలోకి దించాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తోన్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్ర కలను కేసీఆర్ సాకారం చేశారని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి బలమైన పునాది వేశారన్నారు. మనకు అవకాశమిచ్చి తెలంగాణలో కేసీఆర్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. కేసీఆర్ లాగే తాను కూడా మాట ఇస్తే తప్పనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కలిస్తే బాగుంటుందని లోక్ సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్‌తో పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే, ఇది తనకు ఇష్టం లేదని, అందుకే బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆర్‌ఎస్పీ తెలిపారు.

Updated : 18 March 2024 1:37 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top