RS Praveen Kumar : కాంగ్రెస్ నుంచి తెలంగాణను కాపాడేందుకు కేసీఆర్తో చేతులు కలుపుతున్నా: ఆర్ఎస్పీ
X
లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఎన్నికల్లో పొత్తుల అంశంపై కేసీఆర్ నివాసంలో ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పొత్తులపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు విధివిధానాలు త్వరలో ప్రకటింస్తామని కేసీఆర్ చెప్పారు. సిద్ధాంతాల పరంగా బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు ఒకేరకంగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు సహా.. ఎన్నో కార్యక్రమాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధిష్టానం అనుమతి కూడా తీసుకున్న అనంతరం.. మాయావతితో మాట్లాడతానన్నారు.
అనంతరం మాట్లాడిన ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, దేశంలో లౌకిక వాదం ప్రమాదంలో ఉందని విమర్శించారు. కేసీఆర్ లౌకిక వాదాన్ని నిరంతరం కాపాడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ లాగే ప్రవర్తిస్తోంది. అందుకే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయించున్నట్లు చెప్పారు. సీట్ల సర్దుబాటు అంశాన్ని అధిష్టానానికి నివేదిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీఎస్పీల స్నేహం.. తెలంగాణ ప్రజల జీవితాలను బాగు చేస్తుందన్నారు.