Home > తెలంగాణ > వరంగల్‎లో ఘోర ప్రమాదం..లారీ బీభత్సంతో నుజ్జునుజ్జైన బస్సు

వరంగల్‎లో ఘోర ప్రమాదం..లారీ బీభత్సంతో నుజ్జునుజ్జైన బస్సు

వరంగల్‎లో ఘోర ప్రమాదం..లారీ బీభత్సంతో నుజ్జునుజ్జైన బస్సు
X

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరెపల్లి దర్గా సమీపంలోని ప్రధాన రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు, లారీని ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంతో బస్సులోకి లారీ సగం వరకూ చొచ్చుకెళ్లింది. బస్సు నుజ్జునుజ్జైంది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ ఏకంగా తన డ్రైవింగ్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భయానకంగా మారింది. ప్రమాద ఘటన తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై 2 కి.మీ.ల మేర వాహనాలు నిలిచిపోయి , భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు.

Updated : 3 July 2023 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top