Home > తెలంగాణ > TSRTC ITI Admissions: పదో తరగతి పాస్ అయ్యారా.. ఈ ఆర్టీసీ ఆఫర్ మీకోసం

TSRTC ITI Admissions: పదో తరగతి పాస్ అయ్యారా.. ఈ ఆర్టీసీ ఆఫర్ మీకోసం

TSRTC ITI Admissions: పదో తరగతి పాస్ అయ్యారా.. ఈ ఆర్టీసీ ఆఫర్ మీకోసం
X

టీఎస్ఆర్టీసీ నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పదో తరగతి పాస్ అయిన వారికి ఉపాధి అవకాశం కల్పిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు పెట్టుకోవాలని కోరింది. ఆర్టీసీ తీసుకున్న ఈ తాజా నిర్ణయానికి నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ శివారు హకీంపేటలో టీఎస్ఆర్టీసీ కొత్తగా ఐటీఐ కళాశాలకు ఏర్పాటుచేసింది. అందులో డీటీజీ అనుమతి ఇచ్చిందని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇక అనుభవవజ్ఞులైన అధ్యాపకులతో మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో క్లాసులు భోదిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందాలనుకునే విద్యార్థులు ఈ నెల 8లోగా http://iti.telangana.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 9వ తేదీన వాక్ ఇన్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం కోరకు 9100664452 నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన సూచించారు.






Updated : 5 Oct 2023 5:14 PM IST
Tags:    
Next Story
Share it
Top