Home > తెలంగాణ > ఆర్టీసీ కళాభవన్‌లో ఆర్టీసీ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్

ఆర్టీసీ కళాభవన్‌లో ఆర్టీసీ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్

ఆర్టీసీ కళాభవన్‌లో ఆర్టీసీ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్
X

ఆర్టీసీ కళాభవన్‌లో తెలంగాణ సర్కార్ ఫెస్టివల్ ఛాలెంజ్ నిర్వహించారు. ఆర్టీసీకి రథ చక్రాలు, పునాదులు డ్రైవర్లేనని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఉత్తమ ఉద్యోగులకు మంత్రి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పురస్కారాలు అందజేశారు.అలాగే మహాలక్ష్మి స్కీమ్‌ పేరు మీదుగా మహిళా ఉద్యోగులకు పురస్కారాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా ముందుకెళ్తుందన్నారు. ఉద్యోగుల పీఆర్సీపై సీఎంతో చర్చిస్తానని హామీనిచ్చారు.

ఆర్టీసీలో త్వరలోనే నియామకాలు చేపడుతామన్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువై దేశానికే ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)’ మోడల్‌గా నిలిచిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ గురించి ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ‘రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకం శుభ ముహుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌ను నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గత ఛాలెంజ్‌ల మాదిరిగానే పనిచేసి, ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవేయాలి’ అని కోరారు.

Updated : 7 March 2024 8:05 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top