Home > తెలంగాణ > TSRTC: సిటీ బ‌స్సుల్లో ఇకపై నో చిల్లర..త్వరలో యూపీఐ సర్వీసులు

TSRTC: సిటీ బ‌స్సుల్లో ఇకపై నో చిల్లర..త్వరలో యూపీఐ సర్వీసులు

TSRTC: సిటీ బ‌స్సుల్లో ఇకపై నో చిల్లర..త్వరలో యూపీఐ సర్వీసులు
X

సిటీ బస్సుల్లో చిల్లర కష్టాలు మామూలుగా ఉండవు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులు సరిపడా చేంజ్ తీసుకురాకపోవడం వల్ల బస్ కండక్టర్లు టికెట్లు జారీ చేసేప్పుడు అనేక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఈ చిల్లర కష్టాలకు చెక్ చెప్పాలనే ఉద్దేశంతో హైదరాబాద్‎లో నడిచే సిటీ బస్సులు త్వరలో యూపీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్స్‎ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ యాజమాన్యం కసరత్తులు చేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా ప్రయాణికులతో పాటు ఆర్టీసీ కండక్టర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, చిల్లర కష్టాలు తీరుతాయని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్ సిటీలో నడిచే అన్ని రకాల సిటీ బస్సుల్లో ఈ ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతోంది. ఈ నిర్ణయంతో నగరంలో నిత్యం నడిచే 2,500పై ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో యూపీఐ ద్వారా టికెట్ జారీ చేసే అవకశం ఉంటుంది. ఇప్పటికే జిల్లాల్లో తిరిగే మెట్రో లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఈ విధానం సక్సెస్ అయ్యింది. నగరంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఏసీ బస్సుల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్‌ ఇస్తున్నారు. ఇప్పుడు సిటీ బస్సుల్లో డిజిటల్‌ లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని బస్సుల్లోనూ ఐ-టీమ్స్‌ పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఐ-టీమ్స్‌ యంత్రాలను సరఫరా చేసే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ అధికారులు చెబుతున్నారు.

Updated : 30 Sep 2023 5:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top