Home > తెలంగాణ > Medaram : మేడారం జాతరపై ఆర్టీసీ స్పెషల్ ఫోకస్..రైట్ రైట్

Medaram : మేడారం జాతరపై ఆర్టీసీ స్పెషల్ ఫోకస్..రైట్ రైట్

Medaram   : మేడారం జాతరపై ఆర్టీసీ స్పెషల్ ఫోకస్..రైట్ రైట్
X

ఆసియాలోనే అతి పెద్ద జనజాతరకు రంగం సిద్ధమవుతోంది. మహాజాతరకు ఇంకా వారం రోజులే ఉండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. తెలంగాణ కుంభమేళాపై ఆర్టీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కరోనా వేవ్ తర్వాత మొదలైన 2022 జాతర సమయంలో 3,845 బస్సులు నడిపి సుమారు 25 లక్షల మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందించింది. ఈసారి కోవిడ్ లేకపోవడమే కాకుండా ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ఉండడంతో.. కోటీ 30 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 35 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేయడమే లక్ష్యంగా 6 వేల బస్సులను నడపనున్నట్టు ఆ సంస్థ ఎండీ వీసీ.సజ్జనార్‍ తెలిపారు.

ముఖ్యంగా జాతర జరిగే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు లక్షలాది మంది ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో 9 రీజియన్ల పరిధిలోని బస్సులను మేడారానికే నడిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‍, హైదరాబాద్‍, రంగారెడ్డి, కరీంనగర్‍, ఖమ్మం, ఆదిలాబాద్‍, నిజామాబాద్‍తో పాటు మహారాష్ట్ర నుంచి మొత్తం 51 పాయింట్ల ద్వారా ఈనెల 18 నుంచి పెంచిన ప్రత్యేక బస్సులను నడపనున్నారు. గ్రేటర్‍ హైదరాబాద్‍ పరిధిలో 2,650 బస్సులు నడుస్తున్నాయి. కాగా ఈ నెల 20 నుంచి 25 వరకు ఇందులోని 2200 బస్సులను మేడారం జాతరకు ఉపయోగించనున్నట్లు అధికారులు చెప్పారు.

మహాజాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా భక్తులు తరలిరానున్నడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంతంలో 50 నుంచి 60 ఎకరాల్లో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 16 నుంచి మేడారం ఆర్టీసీ బేస్‍ క్యాంపు వేదికగా ఉన్నాతాధికారులు మానిటరింగ్‍ చేయనున్నారు. 14 వేల మంది సిబ్బంది మేడారం డ్యూటీలు చేయనున్నారు. ఉమ్మడి వరంగల్‍ నుంచే దాదాపు 2 వేల బస్సులను జాతరకు నడపనున్నారు.




Updated : 13 Feb 2024 8:25 AM IST
Tags:    
Next Story
Share it
Top