Home > తెలంగాణ > రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పంపిణీ ప్రక్రియ వేగవంతం

రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పంపిణీ ప్రక్రియ వేగవంతం

రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పంపిణీ ప్రక్రియ వేగవంతం
X

తెలంగాణలో యాసంగికి సంబంధించి పెట్టుబడి సాయం చాలా మంది రైతులకు ఇంకా అందలేదు. ఇప్పటివరకు 40శాతం మంది రైతులకు రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి. ఎకరం లోపు ఉన్నవాళ్లకు ఇప్పటివరకు డబ్బులు జమ చేసినట్లు తెలుస్తోంది. అయితే మిగితా రైతులు రైతు బంధు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు డబ్బులు వస్తాయా.. రావా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవాళ్టి నుంచి రైతు బంధు డబ్బుల పంపిణీ ప్రక్రియ వేగవంతం కానుంది.

రైతుల ఖాతాల్లో త్వరతగతిన డబ్బులు జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సంక్రాంతిలోపు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. మంత్రి ఆదేశంతో రైతు బంధు పంపిణీ ప్రక్రియ స్పీడప్ కానుంది .రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. కానీ రైతుల విషయంలో తాము ఎలాంటి కష్టమైనా పడుతామని తుమ్మల స్పష్టం చేశారు.

Updated : 8 Jan 2024 9:28 AM IST
Tags:    
Next Story
Share it
Top