Home > తెలంగాణ > బీఆర్ఎస్ పార్టీ తరఫున సాయిచంద్ దశదిన కర్మ..

బీఆర్ఎస్ పార్టీ తరఫున సాయిచంద్ దశదిన కర్మ..

బీఆర్ఎస్ పార్టీ తరఫున సాయిచంద్ దశదిన కర్మ..
X

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వేద సాయిచంద్‌(39).. జూన్ 29(గురువారం) గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయిచంద్ మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. చనిపోయారన్న వార్త తెలియగానే మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ హుటాహుటిన హాస్పిటల్ కు బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయనకు తుది నివాళులర్పించారు. అంత్యక్రియలకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నేతలు, కళాకారులు హాజరయ్యారు.





ఇదిలా ఉండగా.. సాయి చంద్‌ దశదిన కర్మ ఈ ఆదివారం(09-07-2023) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు GSR కన్వెన్షన్, హస్తినాపురం సెంట్రల్, సాగర్ రోడ్, రంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమం జరుపబడునని..విప్ బాల్క సుమన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ట్విట్టర్ లో దశదిన కర్మకు సంబంధించిన పోస్ట్ ను షేర్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేశారు. బీఆర్ఎస్ చరిత్రలో ఓ వ్యక్తి దశదినకర్మను నిర్వహించడం ఇదే తొలిసారి. పార్టీ తరఫున సాయిచంద్ కి ఇస్తున్న ఘన నివాళి ఇదని చెప్పవచ్చు.

గత నెల 28న బుధవారం సాయంత్రం సాయిచంద్ తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.



Updated : 4 July 2023 7:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top