Home > తెలంగాణ > సజ్జనార్ కీలక ప్రకటన..ఇక వారికి కూడా స్పెషల్ బస్సులు!

సజ్జనార్ కీలక ప్రకటన..ఇక వారికి కూడా స్పెషల్ బస్సులు!

సజ్జనార్ కీలక ప్రకటన..ఇక వారికి కూడా స్పెషల్ బస్సులు!
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఈ స్కీమ్ ద్వారా బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే బస్సులోని అన్ని సీట్లలో మహిళలే కూర్చుంటున్నారు. బస్సు సీటు కోసం మరికొందరు గొడవకు దిగుతున్నారు. చాలా మంది స్టాండింగ్ లోనే ప్రయాణం చేస్తున్నారు. పురుషుల సంగతి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, తమకు కూడా స్పెషల్ బస్సులు కేటాయించాలని పురుషులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇకపోతే దివ్యాంగులు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని చూస్తోంది. ఈ తరుణంలో దివ్యాంగుల కోసం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చారిత్రాత్మక నిర్ణయమని, 45 రోజుల్లో 12 కోట్లకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్లు చెప్పుకొచ్చారు. అయితే దివ్యాంగులకు కేటాయించిన సీట్లల్లో కూడా మహిళలే కూర్చుంటున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

తెలంగాణకు త్వరలో 2,375 కొత్త బస్సులు వస్తాయని, వాటివల్ల కొంత వెసులుబాటు కలుగుతుందని సజ్జనార్ తెలిపారు. అవసరమైతే దివ్యాంగుల కోసం స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతామన్నారు. ఈ విషయంలో టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అలాగే అనౌన్స్‌మెంట్, ఎంక్వైరీ రూము ఉద్యోగాల్లో దివ్యాంగులకు అవకాశం కల్పిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హామీ ఇచ్చారు.

Updated : 28 Jan 2024 7:44 PM IST
Tags:    
Next Story
Share it
Top