Home > తెలంగాణ > Salon Shop Owner: కూకట్ పల్లిలో దారుణం.. సెలూన్ యజమాని హత్య

Salon Shop Owner: కూకట్ పల్లిలో దారుణం.. సెలూన్ యజమాని హత్య

Salon Shop Owner: కూకట్ పల్లిలో దారుణం.. సెలూన్ యజమాని హత్య
X

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ సెలూన్ షాప్ ఓనర్ అశోక్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు ఆయన్ను హత్య చేసి సెలూన్‌లోనే శవాన్ని పడేసి వెళ్లారు. అర్థరాత్రి అయినా అశోక్ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సెలూన్ తెరిచి చూడగా శవమై కనిపించాడు. అశోక్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. పాపారాయుడు నగర్‌లో 'హర్ష లుక్స్' అనే సెలూన్ నడుపుతున్న అశోక్ ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సెలూన్‌లోని సీసీ కెమెరాలు ఉన్న సైతం ధ్వంసం చేసి దుండగులు దుండగులు పరారయ్యారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తన సెల్ ఫోన్‌కి అశోక్ కుటుంబ సభ్యులు కాల్ చేశారు. అయితే లిఫ్ట్ చేయకపోవడంతో సెలూన్ దగ్గరికి అతని భార్య, కుమారులు వచ్చారు. సెలూన్ షట్టర్ పైకి లేపడంతో విగతజీవిగా పడి ఉన్న అశోక్‌ను గుర్తించారు. వెంటనే అశోక్ భార్య పోలీసులకు సమాచారం అందించారు. కూకట్‌పల్లి పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నారు.

గడ్డం గీసే కత్తితోనే అశోక్ ను చంపినట్లు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును చాలా సీరియస్​ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అశోక్ దగ్గర పని చేసిన యువకుడే ఈ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 16 Oct 2023 11:25 AM IST
Tags:    
Next Story
Share it
Top