Home > తెలంగాణ > TS Assembly : కీలక పరిణామం.. మంత్రి కేటీఆర్తో జగ్గారెడ్డి సమావేశం..

TS Assembly : కీలక పరిణామం.. మంత్రి కేటీఆర్తో జగ్గారెడ్డి సమావేశం..

TS Assembly : కీలక పరిణామం.. మంత్రి కేటీఆర్తో జగ్గారెడ్డి సమావేశం..
X

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా కీలక పరిణామం జరిగింది. మంత్రి కేటీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశమయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సమస్యలపై మంత్రికి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

జగ్గారెడ్డి టీషర్ట్ వేసుకుని రావడంతో కేటీఆర్ ఫన్నీ కామెంట్స్ చేశారు. జగ్గారెడ్డితో టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రవిందర్ కూడా ఉండడంతో.. మీ ఇద్దరి సోపతి ఎప్పటినుంచి అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే తమది ఒకే కంచం.. ఒకే మంచం అని మామిళ్ల కేటీఆర్కు తెలిపారు. అయితే నువ్వే దగ్గరుండి జగ్గారెడ్డిని గెలిపిస్తావా అని మంత్రి అడిగ్గా.. జగ్గారెడ్డిని గెలిపించడమే కాకుండా మనదగ్గరికి పట్టుకోస్తానంటూ చెప్పడం గమనార్హం.

కాగా గత కొంత కాలంగా జగ్గారెడ్డి కాంగ్రెస్ తో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే పలుసార్లు ఆయన బహిరంగంగా రేవంత్ను విమర్శించారు. ఈ క్రమంలో ఆయన కేటీఆర్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. తాజా భేటీతో జగ్గారెడ్డిలో బీఆర్ఎస్లో చేరుతారా అనే ప్రచారం నడుస్తోంది.



Updated : 3 Aug 2023 2:18 PM IST
Tags:    
Next Story
Share it
Top