Home > తెలంగాణ > షోయబ్‌తో విడాకుల త‌ర్వాత సానియా తొలి పోస్ట్

షోయబ్‌తో విడాకుల త‌ర్వాత సానియా తొలి పోస్ట్

షోయబ్‌తో విడాకుల త‌ర్వాత సానియా తొలి పోస్ట్
X

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న తర్వాత భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారి ఓ పోస్ట్ చేశారు. అద్దంలో తనను చూసుకుంటున్న ఫోటోను తన ఇన్‌స్టాలో ఆమె షేర్ చేశారు. ఆ ఫోటోకు రిఫ్లెక్ట్ అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించేది అనే అర్థం వస్తుంది. సానియా పెట్టిన పోస్ట్ తన వైవాహిక జీవితంలో ఎదురైనటువంటి ఇబ్బందుల గురించే అయ్యుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం సానియా మీర్జా తన పరిస్థితులను అధిగమించి ఆనందంగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. పాక్ క్రికెటర్ షోయబ్ మాటిక్‌ను సానియా మీర్జా 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సానియాకు అది మొదటి వివాహం అయితే షోయబ్ మాలిక్‌కు అది రెండో పెళ్లి. షోయబ్ తన మొదటి భార్య అయేషా సిద్ధిఖితో విడాకులు తీసుకున్న తర్వాత సానియాను రెండు పెళ్లి చేసుకున్నారు. వారికి 2018లో ఓ కుమారుడు కూడా జన్మించారు.

అయితే గత కొంతకాలంగా సానియా, షోయబ్ విడిగా ఉన్నారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరలో వారు విడాకులు తీసుకుంటారని చాలా మంది చర్చించుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్లుగానే కొద్ది నెలల కిందటే సానియా, షోయబ్‌లు విడాకులు తీసుకున్నారని సానియా కుటుంబం వెల్లడించింది. ఆ తర్వాత ఇటీవలె షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ఈ తరుణంలో సానియా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Updated : 26 Jan 2024 4:23 PM IST
Tags:    
Next Story
Share it
Top