ఎన్నికల బరిలో సర్పంచ్ నవ్య.. స్టేషన్ ఘన్పూర్ నుంచి నామినేషన్
Kiran | 10 Nov 2023 7:57 PM IST
X
X
ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలు చేసిన జానకిపురం సర్పంచ్ నవ్య ఎన్నికల బరిలో నిలిచారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యపై ఆమె ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో అవకాశమిస్తే.. స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీకి సిద్ధమని నవ్య ప్రకటించారు. పార్టీ బీఫాం ఇస్తే ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు సిద్ధమని చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. ఆ టికెట్ను కడియం శ్రీహరికి ఇచ్చింది. దీంతో నవ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు. నవ్య చేసిన ఆరోపణల వల్లే తాటికొండ రాజయ్యకు టికెట్ రాలేదన్న వాదన వినిపిస్తోంది.
Updated : 10 Nov 2023 7:57 PM IST
Tags: telangana news telangana politics telangana elections assembly elections mla rajaiah janakipuram sarpanch navya station ghanpur kadian srihari independent candidate tatikonda rajaiah
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire