కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి..
సీఎం కేసీఆర్‌పై ఉన్న తనకు ఉన్న అభిమానాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి చాటుకున్నారు. కేసీఆర్ పేరును తన చేతిపై పచ్చబొట్టుగా వేసుకుని వార్తల్లో నిలిచారు. కొమురం భీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రికి పచ్చబొట్టు వేశారు. దీంతో ఆమెను అభినందిస్తూ మంత్రి బహుమానం అందజేశారు.
జూన్ 2 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. బంజారహిల్స్, రోడ్ నెం.10 లోని బంజారా భవన్‌లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు.ఈ క్రమంలోనే ఆమెకు పచ్చబొట్టు స్టాల్ కూడా కనిపించింది. వెంటనే కేసీఆర్ పేరు రాయాలని కోరారు. నొప్పిని భరిస్తూనే సీఎం కేసీఆర్ పేరునుపచ్చబొట్టుగా వేయించుకున్నారు. గిరిజన సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని స్పష్టం చేశారు.మంత్రి సత్యవతి రాథోడ్ పచ్చబొట్టు వేసుకున్న వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేసీఆర్ పేరునే పచ్చబొట్టుగా వేయించుకున్న మంత్రి..