Home > తెలంగాణ > రాష్ట్రంలో 9,210 పోస్టులు.. పరీక్షల తేదీలు ప్రకటన

రాష్ట్రంలో 9,210 పోస్టులు.. పరీక్షల తేదీలు ప్రకటన

రాష్ట్రంలో 9,210 పోస్టులు.. పరీక్షల తేదీలు ప్రకటన
X

రాష్ట్రంలోని గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టుల భర్తీకి రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి 22 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల బోర్డ్ కన్వినర్ మల్లయ్య బట్టు తెలిపారు. ఈ పరీక్షలకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మూడు షిఫ్లుల్లో పరీక్షలు జరుగుతాయి. మొదటి పరీక్ష ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, రెండోది మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, మూడో పరీక్ష 4:30 నుంచి 6:30 వరకు నిర్వహిస్తారు.

గురుకుల పోస్ట్ లకు పేపర్ 1 ఎగ్జామ్ ఆగస్టు 10, 11, 12 తేదీల్లో ఉంటాయి. ఆగస్టు 1 నుంచి 7 వరకు.. జేఎల్‌, డీఎల్‌, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్స్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌ పేపర్‌ 2 పరీక్షలు నిర్వహిస్తారు.

పీజీటీ, డీఎల్, జేఎల్ పోస్టులకు పేపర్ 1 ఎగ్జామ్ ఉమ్మడిగా ఉంటుంది. నార్మలలైజేషన్ ప్రాసెస్ లో మార్కులు లెక్కించేందుకు అవకాశం లేదు. దాంతో కొన్ని సబ్జెక్టులు కలిపి వేర్వేరు షిఫ్టుల్లో పేపర్ 1 పరీక్ష ఉంటుంది.

ఆగస్టు 1 నుంచి 7 వరకు జరగబోయే టీజీటీ, లైబ్రేరియన్, పీడీ స్కూల్స్ పరీక్షను కూడా ఇదే విధంగా నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షల తర్వాత పేపర్-3 పరీక్షలుంటాయి. పూర్తి వివరాలకు: https://treirb.telangana.gov.in/లో లాగిన్ అయి చూడవచ్చు.

Updated : 18 Jun 2023 7:32 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top