Home > తెలంగాణ > Sankranti,Special Trains : పండుగకు ఊరెళ్లేవారికి గుడ్‌‌న్యూస్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే

Sankranti,Special Trains : పండుగకు ఊరెళ్లేవారికి గుడ్‌‌న్యూస్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే

Sankranti,Special Trains  : పండుగకు ఊరెళ్లేవారికి గుడ్‌‌న్యూస్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే
X

సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకోని దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్, విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. అవి ఏ సమయంలో బయలుదేరతాయి.

ఎక్కడ నుండి బయలుదేరాతాయో అనే వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైళ్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

జనవరి 8, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి బ్రహ్మపూర్‌ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రాత్రి 07:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు బ్రహ్మపూర్‌ చేరుకుంటుంది.

జనవరి 9, 16 తేదీల్లో బ్రహ్మపూర్ నుండి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

జనవరి 10వ తేదీన నర్సాపూర్ నుండి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 04:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

జనవరి 11వ తేదీన సికింద్రాబాద్ నుండి నర్సాపూర్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రాత్రి 08:35 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.

జనవరి 7 మరియు 14 తేదీలలో, సికింద్రాబాద్ నుండి బ్రహ్మపూర్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రాత్రి 7:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది.

జనవరి 8 మరియు 15 తేదీలలో బ్రహ్మపూర్ నుండి వికారాబాద్ ప్రత్యేక రైలు బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.

జనవరి 9 మరియు 16 తేదీలలో, వికారాబాద్ నుండి బ్రహ్మపూర్ ప్రత్యేక రైలు వికారాబాద్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది.

జనవరి 10 మరియు 17 తేదీలలో బ్రహ్మపూర్ నుండి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

జనవరి 10, 17, 24 తేదీల్లో విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీకి వెళ్లే ప్రత్యేక రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5:35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కర్నూలు సిటీకి చేరుకుంటుంది.

జనవరి 11, 18, 25 తేదీల్లో కర్నూలు సిటీ నుంచి విశాఖపట్నం ప్రత్యేక రైలు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

జనవరి 12, 19, 26 తేదీల్లో శ్రీకాకుళం-వికారాబాద్ ప్రత్యేక రైలు శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 5:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09:00 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.

జనవరి 12, 19, 26 తేదీల్లో వికారాబాద్ నుంచి శ్రీకాకుళం ప్రత్యేక రైలు వికారాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8:25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.

జనవరి 10 మరియు 17 తేదీలలో సికింద్రాబాద్ నుండి తిరుపతి ప్రత్యేక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

జనవరి 11 మరియు 18 తేదీలలో తిరుపతి నుండి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 5:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05:55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

జనవరి 12వ తేదీన సికింద్రాబాద్ నుండి కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రాత్రి 09:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08:00 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.

జనవరి 13న కాకినాడ టౌన్ నుండి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుండి రాత్రి 08:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Updated : 6 Jan 2024 1:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top