ప్రయాణికులకు ముఖ్య గమనిక.. వారం రోజులపాటు పలు రైళ్లు రద్దు
X
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైళ్ల ప్రమాదంతో ఇప్పటికే పలు రూట్లలో రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. బుధవారం నుంచి ఈ నెల 13 వరకు మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బాలాసోర్ ప్రమాదంతో పాటు నిర్వహణ కారణాల వల్ల వీటిని రద్దు చేసినట్టు తెలిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే పలు రైళ్లు రద్దయినట్లు తెల్పింది దక్షిణ మధ్య రైల్వే. మరోవైపు వేసవి సెలవులు ముగుస్తుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రాకపోకలు ఊపందుకున్నాయి. ఇలాంటి సమయంలో రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. ఐతే కాచిగూడ–తిరుపతి (070 61 / 07062), కాచిగూడ–కాకినాడ (07417 / 07418), కాచిగూడ–నర్సాపూర్ (07653 / 07654) ప్రత్యేక రైళ్లను మాత్రం జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు సీపీఆర్వో తెలిపారు. ఏయే రైళ్లు, ఏయే తేదీల్లో నిలిచిపోనున్నాయంటే..
జూన్ 7 నుంచి 13 వరకు రద్దయ్యే ట్రైన్లు ఇవే..
కాచిగూడ–నిజామాబాద్ (07596)
నిజామాబాద్–కాచిగూడ (07593)
నాందేడ్–నిజామాబాద్ (07854)
నిజామాబాద్–నాదేడ్ (07853)
జూన్ 7న రద్దయ్యే ట్రైన్లు
కాచిగూడ–షాలిమార్–వాస్కోడిగామా (17603/18047)
షాలిమార్–హైదరాబాద్ (18045/18046)
వాస్కోడిగామా–షాలిమార్–కాచిగూడ (18048/17604) రైలు జూన్ 9న రద్దు కానుంది. అలాగే దౌండ్–నిజామాబాద్ (11409), నిజామాబాద్–పంఢర్‌పూర్ (01413) రైళ్లు పాక్షికంగా రద్దుకానున్నట్లు ఇండియన్ రైల్వే తెల్పింది.