Home > తెలంగాణ > మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట

మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట

మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట
X

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలంతా కలిసి శుక్రవారం (మార్చి 1) చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు మేడిగడ్డపై వాస్తవాలు తెలియపరిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. 200 మందికి పైగా పార్టీ నేతలు తెలంగాణ భవన్ నుంచి వోల్వో బస్సుల్లో మేడిగడ్డ చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. డ్యాం సేఫ్టీ విషయంలో పోలీసులు ముందుగానే గేట్లు మూసేశారు. మేడిగడ్డకు 200 మంది వస్తామని చెప్పి.. 2000 వేల మందికి పైగా కార్యకర్తలు, నేతలు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు లోనికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కార్యకర్తలు గేట్లు తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. వారిని ఆపే ప్రయత్నం చేయగా.. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

దీంతో మేడిగడ్డ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు హెచ్చరిస్తున్నా.. కార్యకర్తలతో బీఆర్ఎస్ నాయకులు బ్యారేజీ వద్దకు వెళ్లి పరిశీలించారు. తర్వాత అన్నారం బ్యారేజీని పరిశీలించేందుకు వెళ్లనున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా మేడిగడ్డను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. బ్యారేజీని పరిశీలించేందుకు ఇరిగేషన్ నిపుణులతో వచ్చామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు 50 మీటర్లలో ఉన్న లోపాన్ని మొత్తం బ్యారేజీకే అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులపై కక్షపూరితంగా వ్యవహరించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అంతేగాక ఇరిగేషన్ నిపుణులతో వెంటనే కమిటీ వేసి, లోపాన్ని త్వరగా సరిదిద్ది రైతుల సాగునీళ్లివ్వాలని కేటీఆర్ కోరారు.

Updated : 1 March 2024 6:16 PM IST
Tags:    
Next Story
Share it
Top