Home > తెలంగాణ > పాతబస్తీలో మెట్రో రెండో దశ పనులకు 8న సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

పాతబస్తీలో మెట్రో రెండో దశ పనులకు 8న సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

పాతబస్తీలో మెట్రో రెండో దశ పనులకు 8న సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
X

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న పాతబస్తీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనునన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలనూమా వరుకు 5.5 కీ.మీ మెట్రో మార్గానికి పనులు మొదలుపెట్టనున్నారు. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నూమాలో నాలుగు స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మార్గంలో అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్‌నుమా చేరుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉంది. మియాపూర్-ఎల్బీనగర్, రాయదుర్గం-నాగోల్, జూబ్లీ బస్ స్టేషన్-మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్లు ఉన్నాయి.ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న పాతబస్తీలోని ఫలక్‌నుమా వద్ద పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ మార్గంలో ఐదు స్టేషన్లు వుంటాయి. మొత్తం 5.5 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఈ నిర్మాణానికి సుమారు రూ. 2000 కోట్ల వరకు ఖర్చు కానుంది. 2012లోనే జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి ఫలక్‌నూమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసారు. కానీ పలు కారణాల వల్ల ఈ మెట్రో నిర్మాణాన్ని ఎంజీబీఎస్‌ వరకే ఆపేశారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ చేపట్టడం, నిర్మాణాల కూల్చివేతల వంటి కారణాల వల్ల నిర్మాణ పనుల్లో చాలా ఆలస్యం జరిగింది. డీపీఆర్‌తో పాటు మరికొన్ని పనులు కూడా పూర్తయ్యాయి. కానీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మెట్రో నిర్మాణంపై నిర్లక్ష్యం వహించింది. ఇక చివరకి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ .. పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించింది. అంతేకాదు ఈ నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది.

Updated : 4 March 2024 2:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top