Home > తెలంగాణ > Hi Tech City MMTS : MMTS రెండో దశ పనులు పూర్తి.. ఇక అరగంటలో ఐటీ కారిడార్కు

Hi Tech City MMTS : MMTS రెండో దశ పనులు పూర్తి.. ఇక అరగంటలో ఐటీ కారిడార్కు

Hi Tech City MMTS : MMTS రెండో దశ పనులు పూర్తి.. ఇక అరగంటలో ఐటీ కారిడార్కు
X

ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా... మౌలాలి- సనత్ నగర్ మధ్య కడుతున్న రెండో లైన్ పనులు ముగిశాయి. దీంతో మౌలాలి నుంచి హైటెక్‌సిటీ మీదుగా లింగంపల్లికి ఎంఎంటీఎస్‌ రైళ్లో వెళ్లే అవకాశం లభించనుంది. కాగా ఫిబ్రవరి నెలకల్లా ఈ రైలు మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అదే జరిగితే మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు హైటెక్ సిటీ వెళ్లెందుకు మార్గం సుగమం అవుతుంది. కాగా ఈ రైలు మార్గం.. మౌలాలి - సనత్‌నగర్‌ మధ్య మొత్తం 22 కిలోమీటర్ల పరిధి ఉండగా.. అందులో మొత్తం 6 స్టేషన్లను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వారందరికీ రూ.5 టికెట్ తో వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

ఇక్కడి ప్రజలు కేవలం 30 నిమిషాల్లో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. మల్కాజిగిరి ప్రాంతంలో 25 నుంచి 35 వేల మంది ఐటీ ఉద్యోగులు నివసిస్తుంటారు. వీరికి ఈ కొత్త ప్రాజెక్ట్ బాగా ఉపయోగపడుతుంది. అదే జరిగితే వారంతా సొంతింటి నుంచి ఆఫీసుకు వెళ్లినంత ఈజీగా ట్రావెల్ చేయొచ్చు.




Updated : 5 Jan 2024 11:29 AM IST
Tags:    
Next Story
Share it
Top