Home > తెలంగాణ > MODI : సికింద్రాబాద్-వైజాగ్ మధ్య ..మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని

MODI : సికింద్రాబాద్-వైజాగ్ మధ్య ..మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని

MODI : సికింద్రాబాద్-వైజాగ్ మధ్య ..మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని
X

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందే భారత్ రైలు ప్రారంభమయ్యాయి.సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో ఒకటి కలబురిగి-బెంగుళూరు మధ్య మరొకటి నడవనున్నారు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 10 నూతన వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 51కి చేరింది. సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య రెండో రైలు కాగా... మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది.ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100 శాతం కన్నా ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తోంది. నూతన వందేభారత్ సాధారణ సేవలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల పట్ల ప్రధాని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టామని కిషన్‌రెడ్డి తెలిపారు. దక్షిణమధ్య రైల్వేలో ప్రస్తుతం 3 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయ వెల్లడించారు.




Updated : 12 March 2024 6:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top